నెట్‌ఫ్లిక్స్‌లోకి సూర్య సీన్.. స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?

November 24, 2026


img

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య నటించిన తాజా చిత్రం ‘సీన్’ నవంబర్ 6న దీపావళి కానుకగా థియేటర్లలో విడుదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన అందుకున్న ఈ సినిమా ఇప్పుడు డిసెంబర్ 4 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమవుతోంది. 

‘రోమాంచం’, ‘ఆవేశం’ వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న జీతూ మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఒకేసారి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కాబోతోంది. 

ఈ సినిమాలో డీఎస్పీ ఇన్బరాజ్ పాత్రలో సూర్య నటించారు. నజ్రియా నజీమ్ మాయగా, నస్లెన్ ఈశ్వరన్ పాత్రలో కనిపించారు. వీరితో పాటు లాల్, ఆనందరాజ్, జాన్ విజయ్ కీలక పాత్రలు పోషించారు. టోవినో థామస్ ప్రత్యేక పాత్రలో కనిపించారు.

వరుస హత్యల కేసును దర్యాప్తు చేసే పోలీస్ అధికారి చుట్టూ ఈ కథ తిరుగుతుంది. విచారణలో భాగంగా గతంలో జరిగిన ఓ హత్యకు, ప్రస్తుతం జరుగుతున్న హత్యలకు మధ్య సంబంధం ఉందని తెలుసుకుంటాడు. ఆ హత్యల వెనుక ఉన్న నిజాన్ని ఎలా బయటపెట్టాడన్నదే సినిమా కథ.

సూర్య, జ్యోతిక దంపతులు కలిసి 2డి ఎంటర్‌టైన్‌మెంట్స్, జగరం స్టూడియోస్ బ్యానర్లపై ఈ సినిమా నిర్మించారు.


Related Post

సినిమా స‌మీక్ష