ప్రముఖ సినీ నటి త్రిష, తమిళనాడు సిఎం విజయ్ మధ్య ఉన్న వివాహేతర బంధం రహస్య విషయమేమీ కాదు. ఆయన సీఎం అయినప్పటి నుంచి ఆమె ఏదో ఓ హడావుడి చేస్తూనే ఉన్నారు.
ఆమె రాజకీయాల్లోకి వస్తారని, టీవీకే పార్టీలో చేరి ఉప ఎన్నికల్లో పోటీ చేస్తారంటూ కొంతకాలంగా ప్రచారం జరుగుతూనే ఉంది. తాజాగా ఆమె పేరుతో తమిళనాడులో ఓ కొత్త సేవా సంస్థ ఏర్పాటైంది. తమిళనాడులోని తిరునల్వేలిలో ‘ఇళయ పురట్చి తలైవి త్రిష పేరవై’ పేరుతో రాజగోపాల్ అనే అభిమాని ఈ సంస్థను ఏర్పాటు చేశారు.
ఈ సంస్థ లోగోను ఆవిష్కరించిన తర్వాత తమ సంస్థ నిర్వాహకులను మీడియాకు పరిచయం చేశారు. లోగోపై ‘పదవుల కోసం కాదు.. తమిళ ప్రజల హక్కుల కోసం’ అనే నినాదాన్ని పొందుపరిచారు.
అంతే కాదు.. దివంగత సీఎం జయలలితకు త్రిష రాజకీయ వారసురాలని ఈ సంస్థ నిర్వాహకులు ప్రకటిస్తూ అచ్చం ఆమె రూపురేఖలను పోలినట్లు లోగోపై త్రిష చిత్రాన్ని ముద్రించారు.
ఈ సందర్భంగా ఈ సంస్థ వ్యవస్థాపకుడు రాజగోపాల్ మాట్లాడుతూ, “స్వర్గీయ జయలలిత ఏవిధంగా మంచి సమర్ధురాలైన నాయకురాలో త్రిషలో కూడా అటువంటి సమర్థురాలే. ఆమెలో కూడా అలాంటి గొప్ప నాయకత్వ లక్షణాలు ఉన్నాయి. ఆమె రాజకీయాల్లోకి వస్తే తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం మంచి పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు రూపొందించగలరు. మేము త్రిషను జయలలిత రాజకీయ వారసురాలిగా భావిస్తున్నాము. ఈ ఆలోచనతోనే త్రిష పేరుతో సేవా సంస్థను ఏర్పాటు చేశాము,” అని అన్నారు.
అయితే ఈ సంస్థ ఏర్పాటుకు త్రిష అనుమతి తీసుకున్నారా? ఆమెకు ఈ సంస్థతో ఏమైనా సంబంధం ఉందా? అనే విషయాలపై ఇంకా స్పష్టత లేదు.