త్రివిక్రమ్ శ్రీనివాస్-విక్టరీ వెంకటేష్ కాంబినేషన్లో అక్టోబర్ 30న థియేటర్లలోకి వచ్చిన ‘ఆదర్శ కుటుంబం (హౌస్ నం: 47) ప్రేక్షకులను రంజింపజేసింది. కనుక ఈ సినిమా కోసం ఓటీటీ ప్రేక్షకులు ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. వారి ఎదురుచూపులకు ముగింపు పలుకుతూ ఈ నెల 27న ఆదర్శ కుటుంబం నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్ భార్యగా శ్రీనిధి శెట్టి, వారి కుమార్తె సంపూర్ణగా యువినా పార్ధవి, పోలీస్ ఆఫీసరుగా నారా రోహిత్ నటించగా, రావు రమేష్, బ్రహ్మాజీ, పూజిత పొన్నాడ, నికితిన్ ధీర్, ఉదయ్బీర్ సంధు తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
ఈ సినిమాకు స్క్రీన్ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్ శ్రీనివాస్; సంగీతం: తమన్, కెమెరా: రవి కే చంద్రన్; యాక్షన్: కేవిఎన్ కుమార్; ఆర్ట్: ఏఎస్. ప్రకాష్; ఎడిటింగ్: శ్రీకర ప్రసాద్ చేశారు.