పెద్ది ట్రైలర్‌: రామ్‌ చరణ్‌ విశ్వరూపమే!

May 19, 2026
img

బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్‌ చరణ్‌, జాన్వీ కపూర్‌ జంటగా చేస్తున్న ‘పెద్ది’ పెద్ది ట్రైలర్‌ సోమవారం ముంబాయిలో రిలీజ్ చేశారు. చిరంజీవి చెప్పినట్లుగానే పెద్ది పాత్రలో రామ్‌ చరణ్‌ తన నట విశ్వరూపం చూపారని చెప్పవచ్చు. ట్రైలర్‌లో యాక్షన్ సన్నివేశాలలో రామ్‌ చరణ్‌ నటన అద్భుతంగా ఉంది. 

ట్రైలర్‌లో పెద్ది ఫస్ట్ గ్లిమ్స్‌లో మైదానంలో బ్యాట్ పట్టుకొని కొట్టిన మొదటి హుక్ షాట్‌ని ట్రైలర్‌లో బంతికి బదులు అవతలి వైపు నుంచి కండలు తిరిగిన పహిల్వాన్ మీదకు దూసుకురాగా పెద్ది అతనిని అలవోకగా విసిరి పారేసినట్లు మిక్స్ చేసిన సీన్ చాలా సింబాలిక్‌గా చూపడం దర్శకుడు బుచ్చిబాబు పనితనానికి నిదర్శనం. 

ఏఆర్ రహమాన్ అందించిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఉంది. ఈ సినిమాలో పల్లెటూరి పిల్లగా నటించిన బాలీవుడ్‌ బ్యూటీ జాహ్నవీ కపూర్ ట్రైలర్‌లో అందాల ఆరబోశారు. మొత్తం మీద పెద్ది ట్రైలర్‌ సినిమాపై అంచనాలు ఇంకా పెంచేసింది. ఇక మిగిలింది పెద్ది స్పెషల్ సాంగ్‌... ఈ నెల 23న భోపాల్‌లో విడుదల కాబోతోంది.

ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్‌, కోచ్‌ గౌరు నాయుడుగా శివరాజ్ కుమార్‌ నటిస్తున్నారు. జగపతి బాబు, శివ రాజ్ కుమార్‌, దివ్యేంద్రు తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. ఈ సినిమాకి సంగీతం: ఏఆర్ రహమాన్, కెమెరా: రత్నవేలు, ఎడిటింగ్: నవీన్ నూలి చేశారు.  

వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లపై వెంకట సతీష్ కిలారు 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మించిన పెద్ది జూన్ 4న విడుదల ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.   

Related Post