ఆకాశంలో మరో తార డియర్ ఆస్ట్రోనాట్.. ట్రైలర్‌

November 15, 2026


img

సల్మాన్ దుల్కర్, సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రలు చేసిన ఆకాశంలో ఒక తార నవంబర్‌ 20న విడుదల కాబోతోంది. ఇప్పుడు ఇంచుమించు అతువంటి కథతోనే ‘డియర్ ఆస్ట్రోనాట్’ అనే మరో సినిమా కూడా నవంబర్‌ 20న విడుదల కాబోతోంది. 

అయితే ‘ఆకాశంలో ఒక తార’ కథ విషయంలో దర్శకుడు కార్తీక్‌ భగవీరాజా అభ్యంతరం చెపుతున్నారు. 2020లో ‘కౌగిలి’ అనే పేరుతో తాను యూట్యూబ్‌లో పెట్టిన షార్ట్ ఫిలిం కథను తన అనుమతి తీసుకోకుండా వాడుకున్నారని ఆరోపిస్తున్నట్లు తెలుస్తోంది.

అయితే వారితో వివాదం వద్దనుకున్న  కార్తీక్‌ భగవీరాజా  ‘డియర్ ఆస్ట్రోనాట్’ అనే పేరుతో ఈ సినిమా తెరకెక్కించి నవంబర్‌ 20న విడుదల చేస్తున్నారు. ఈరోజు ఈ సినిమా ట్రైలర్‌ విడుదలైంది. 

ఈ సినిమాలో సోమిత్‌ రావు, శ్రేయసి సేన్‌ ప్రధాన పాత్రల్లో నటించగా, గౌతమ్‌ వాసుదేవ్‌ మీనన్‌, రాహుల్‌ రవీంద్రన్‌, గీతా భాస్కర్‌, దేవి ప్రసాద్‌, కేదార్‌ శంకర్‌, ఆశ్రిత, కమల్‌ కామరాజు, శరణ్య ప్రదీప్‌, గురురాజు, శివకుమార్‌ మట్ట, లక్ష్య, శ్రీజ చెన్నమనేని తదితరులు ముఖ్య పాత్రలు చేశారు. చైల్డ్‌ ఆర్టిస్టులు చైత్ర పెద్ది, అనమ్‌ కౌర్‌, అమోఘ, ధ్రువ్‌ కూడా ఈ సినిమాలో నటించారు. .

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: కార్తీక్‌ భగవీరాజా, పాటలు, సంగీతం: కార్తీక్‌ బి. కోడకండ్ల, సినిమాటోగ్రఫీ: శివకుమార్‌ శరవణన్‌, ఎడిటింగ్‌: మార్తాండ్‌ కె. వెంకటేష్‌ చేశారు. 

యువాంకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బ్యానర్‌పై మానస్విని భగవీరాజా ఈ ‘డియర్ ఆస్ట్రోనాట్’ ని ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు.

 


Related Post

సినిమా స‌మీక్ష