ఇక ఎన్టీఆర్‌తో రచ్చరచ్చే: అనిల్ రావిపూడి!

November 14, 2026


img

అనిల్ రావిపూడి వరుస విజయాలతో మంచి ఫామ్‌లో ఉన్నారు. ప్రస్తుతం వెంకటేశ్, కళ్యాణ్ రామ్‌లతో ‘జనవరి 12 విడుదల’ సినిమాని 2027 సంక్రాంతికి ప్రేక్షకులకు అందించబోతున్నారు.

కామెడీ, ఫ్యామిలీ డ్రామా సినిమాలకు పెట్టింది పేరైన అనిల్ రావిపూడి ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌తో తన తదుపరి సినిమా చేయబోతున్నట్లు ‘ఎక్స్‌’లో ప్రకటించారు. ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించబోతున్నారని తెలియజేస్తూ వారిరువురితో దిగిన ఫోటో షేర్ చేశారు.

ఇది జూ. ఎన్టీఆర్ అభిమానులకు చాలా సంతోషం కలిగించే వార్తే. వరుసపెట్టి గంభీరమైన సినిమాలు చేసుకుపోతున్న తమ అభిమాన హీరో, మళ్లీ ఇన్నేళ్ల తర్వాత ‘అదుర్స్’లా వస్తారంటే సంతోషమే కదా?

ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తాను ఎప్పటినుంచో ఓ సినిమా చేయాల్సి ఉందని, ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు అది కార్యరూపం దాల్చబోతోందని తెలిపారు. ఇది పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్ అని, త్వరలోనే షూటింగ్ ప్రారంభిస్తామంటూ అనిల్ రావిపూడి చెప్పేశారు. నందమూరి కళ్యాణ్ రామ్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలను కూడా తన పోస్టులో ట్యాగ్ చేశారు.

వెంకటేశ్‌తో తీసిన ‘ఎఫ్‌2’, ‘ఎఫ్‌3’, ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాలు మంచి విజయాలు సాధించాయి. మహేశ్ బాబుతో ‘సరిలేరు నీకెవ్వరు’, బాలకృష్ణతో ‘భగవంత్ కేసరి’, చిరంజీవితో ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలు కూడా సూపర్ హిట్స్.

అనిల్ రావిపూడి తప్పకుండా ప్రతి సంక్రాంతికి ఓ చక్కటి ఎంటర్‌టైనర్‌తో వస్తారని ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఇప్పుడు జు.ఎన్టీఆర్ తో ఎంత రచ్చ రచ్చ చేస్తాడో? ఎప్పుడు వస్తాడో?


Related Post

సినిమా స‌మీక్ష