అల్లు అర్జున్-సుకుమార్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప-1,2లో తిరుమల శేషాచలం అడవుల్లో జరుగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణాలో హీరోయిజం ఎలివేట్ చేస్తూ చాలా గొప్పగా చూపారు. అయినా సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఇంచుమించు అటువంటి కథతోనే కోలీవుడ్ నటుడు ధనుష్ హీరోగా నటిస్తున్న ‘ఓం చాప్టర్ 1: ఉధిరం- ది బ్లడ్ వుడ్’ అనే సినిమా వస్తోంది.
పుష్పలో మళయాళ నటుడు ఫాజిల్ ఫహాద్ ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకునేందుకు ప్రయత్నించే పోలీస్ అధికారిగా నటించగా ఈ సినిమాలో నిత్యారెడ్డి అనే ఐపీఎస్ ఆఫీసర్‌గా సాయి పల్లవి నటిస్తున్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు ‘ఓం’ పేరుతో చేపట్టే ఆపరేషన్‌కు ఆమె నాయకత్వం వహిస్తారు.
సూపర్ హిట్ మూవీ ‘అమరన్’ దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు.
ఈ చిత్రంలో ధనుష్, మమ్ముట్టి, శ్రీలీల, నసీరుద్దీన్ షా ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు రచన, దర్శకత్వం: రాజ్‌కుమార్ పెరియసామి, సంగీతం: సాయి అభ్యంకర్, కెమెరా: ఎజిల్ అరసు కె, యాక్షన్: యానిక్ బెన్, కెచా ఖంఫక్డీ, ఆర్ట్: ఎ. పన్నీర్‌సెల్వం, కొరియోగ్రఫీ: శాండీ, ఎడిటింగ్: ఆర్. కళైవాణన్ చేశారు.
ఆర్ టేక్ సమర్పణలో ఉండర్‌బార్ ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై శ్రద్ధ అగర్వాల్, ధనుష్, అజ్మాట్ జగ్‌మంగళవారం కలిసి నిర్మిస్తున్న ఈ ‘ఓం’ సినిమా నవంబర్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.