పవన్‌ కల్యాణ్‌తో మరో సినిమా.. దిల్‌ రాజు ప్రకటన!

November 13, 2026


img

పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌తో మరో సినిమా చేసేందుకు ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు సిద్ధమవుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.

గతంలో వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వకీల్‌ సాబ్‌’ మంచి విజయాన్ని అందుకుంది. దీంతో మరోసారి ఈ కాంబినేషన్‌ ఎప్పుడు పట్టాలెక్కుతుందా అని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

పవన్‌ కల్యాణ్‌ నటించిన ‘ఓజీ’ సినిమా నైజాం హక్కులను దిల్‌ రాజు సొంతం చేసుకున్నారు. ఈ సినిమా అక్కడ మంచి వసూళ్లు సాధించడంతో ఆయన అభిమానులతో కలిసి విజయాన్ని సెలబ్రేట్‌ చేసుకున్నారు.

ఈ సందర్భంగా మాట్లాడిన దిల్‌ రాజు.. పవన్‌ కల్యాణ్‌తో మరో సినిమా చేయాలని ప్లాన్‌ చేస్తున్నట్లు తెలిపారు. సరైన సమయంలో ఈ ప్రాజెక్టును అధికారికంగా ప్రకటిస్తామని చెప్పారు.

అయితే ఈ సినిమాకు పవన్‌ కల్యాణ్‌ ఇటీవలే గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినందున దర్శకుడు, హీరోయిన్‌, ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల ఎంపికకు ఇంకా చాలా సమయం పట్టవచ్చు.

పవన్‌ కల్యాణ్‌ ఏపీ డిప్యూటీ సీఎంగా, మంత్రిగా చాలా బిజీగా ఉన్నారు. కనుక వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు మొదలవుతుందో ఇప్పుడే ఊహించి చెప్పడం చాలా కష్టమే. మళ్లీ దిల్‌ రాజు ఇలాగే ప్రకటించేవరకు అభిమానులు ఎదురుచూడక తప్పదు.


Related Post

సినిమా స‌మీక్ష