సత్యవాన్ సావిత్రి.. ట్రైలర్ విడుదల

November 13, 2026


img

కీర్తి సురేష్‌ న్యాయవాదిగా నటించిన కోర్టు డ్రామా ‘సత్యవాన్‌ సావిత్రి’ ట్రైలర్‌ విడుదలైంది. సతీ సావిత్రి యముడి వెంటబడి భర్త ప్రాణాలు కాపాడుకున్నట్లుగానే, ఈ సినిమాలో ఓ హత్య కేసులో చిక్కుకున్న భర్తను కాపాడుకునేందుకు న్యాయవాది సావిత్రి చేసిన పోరాటమే ఈ ‘సత్యవాన్ సావిత్రి’ అని ట్రైలర్‌తో చెప్పేశారు.

ప్రవీణ్‌ ఎస్‌. విజయ్‌ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో చారుకేశ్‌, శరవణన్‌, శిల్పా మంజునాథ్‌, మధుసూదనన్‌, సుందరరాజన్‌, బ్రిగిడా, మాలా పార్వతి, వెంకటేష్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ప్రముఖ నటుడు, దర్శకుడు మిస్కిన్‌ ఈ సినిమాలో క్రిమినల్ లాయర్‌గా నటిస్తున్నారు.

రచన, దర్శకత్వం: ప్రవీణ్‌ ఎస్‌. విజయ్‌, సంగీతం: సామ్‌ సీఎస్‌, సినిమాటోగ్రఫీ: అరుల్‌ విన్సెంట్‌, ఎడిటింగ్‌: ప్రసన్న జీకే, ఆర్ట్‌: ప్రేమ్‌ కరుంతమలై, ఏఎం ఆనందరాజ్‌, పాటలు: మోహన్‌ రాజా, ఉమాదేవి, ప్రవీణ్‌ ఎస్‌. విజయ్‌, కొరియోగ్రఫీ: దినేశ్‌ కుమార్‌, సంతోష్‌ కుమార్‌.

డ్రమ్‌స్టిక్స్‌ ప్రొడక్షన్స్‌, జీ స్టూడియోస్‌ బ్యానర్లపై వేదిక్కారన్‌పట్టి ఎస్‌. శక్తివేల్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్‌. వైష్ణవి వివేక్‌చందర్‌ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమా నవంబర్‌ 20న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది.


Related Post

సినిమా స‌మీక్ష