నేడు హైదరాబాద్‌కు రాహుల్‌ గాంధీ!

November 13, 2026


img

కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌ రాబోతున్నారు. శనివారం ఉదయం హైదరాబాద్‌ శిల్పకళా వేదిక వద్ద నుంచి హెచ్ఐసీసీ వరకు ‘గిగ్ వర్కర్స్’ ర్యాలీ జరుగుతుంది.

ఆ తర్వాత మాదాపూర్, మీనాక్షీ టవర్స్ వద్ద గల మైదానంలో బహిరంగ సభ జరుగబోతోంది. రాహుల్‌ గాంధీ, సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు ఆ సభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా రాహుల్‌ గాంధీ గిగ్ వర్కర్స్‌తో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. ఈ సభలో తెలంగాణ ప్రభుత్వం తరపున గిగ్ వర్కర్స్‌ సంక్షేమానికి కొన్ని హామీలు ప్రకటించే అవకాశం ఉంది. 

ఆ తర్వాత రాహుల్‌ గాంధీ, సిఎం రేవంత్‌ రెడ్డి, మంత్రులు హెచ్ఐసీసీలో జరిగే భారత్‌ సదస్సు-2026లో పాల్గొంటారు.

డెప్యూటీ సిఎం భట్టి విక్రమార్క బెంగుళూరు వెళ్ళి కర్ణాటక సిఎం డీకే శివ కుమార్‌, కాంగ్రెస్‌ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గేలను కలిసి ఈ సదస్సులో పాల్గొనాల్సిందిగా ఆహ్వానించారు. వారు సానుకూలంగా స్పందించారు. రేపు సదస్సులో పాల్గొన్న తర్వాత రాహుల్‌ గాంధీ మళ్ళీ ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.


Related Post