ఈఎన్ఈ రిపీట్.. నుంచి బతుకమ్మ బతుకమ్మా లిరికల్

November 13, 2026


img

విశ్వక్ సేన్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను, సుశాంత్ ప్రధాన పాత్రలలో ‘ఈఎన్ఈ రిపీట్’నుంచి బతుకమ్మ బతుకమ్మ లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. 

తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలను చాటి చెప్పే బతుకమ్మ పాటను మరింత గొప్పగా వ్రాసిన చంద్రబోస్‌ను తప్పక అభినందించాల్సిందే. ఈ పాటకు వివేక్ సాగర్ చక్కటి సంగీతం అందించగా శ్రేయా ఘోషల్ అద్భుతంగా ఆలపించారు.      

తరుణ్ భాస్కర్‌ దర్శకత్వంలో 2018లో విడుదలైన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు మంచి ఆదరణ లభించడంతో ఇన్నేళ్ళ తర్వాత దానికి సీక్వెల్‌గా ‘ఈఎన్ఈ రిపీట్’ తీసుకు వస్తున్నారు.

ఇది కూడా హిట్ అయినా దీనికి మూడో భాగం ఉండదని ఇదే చివరిదని దర్శకుడు తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్ ట్రైలర్‌ లాంచ్ ఈవెంట్‌లో చెప్పేశారు.

ఈ సినిమాలో శ్రీనాథ్‌ మాగంటి, అనీషా ఆంబ్రోస్‌, శివాత్మిక రాజశేఖర్‌, కరుణ కుమార్‌, ప్రియదర్శిని రామ్‌, మహేశ్‌ భాస్కర్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. 

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: తరుణ్ భాస్కర్‌, సంగీతం;వివేక్ సాగర్, కెమెరా: ఏజె ఆరోన్, ఎడిటింగ్: రవితేజ గిరిజాల చేశారు.  

రూట్‌నోడ్ సినిమా బ్యానర్‌పై శృజన్ యెరబోలు నిర్మించిన ఈ సినిమా నవంబర్ 19న థియేటర్లలో విడుదల కానుంది.


Related Post

సినిమా స‌మీక్ష