తెలంగాణలో పోలీస్ శాఖలో భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం ఒకేసారి 21 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా చేస్తున్న విసి సజ్జనార్‌ను ఫైర్. డిజాస్టర్ రెస్పాన్స్ డీజీగా బదిలీ చేసి అయనకు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్పీఎఫ్) డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించింది. ఆయన స్థానంలో మహేశ్ మురళీధర్ భగవత్‌ను హైదరాబాద్ సీపీగా నియమించింది.
వి. అరవింద బాబు: హైదరాబాద్ సిటీ డీసీపీ
చారు సిన్హా: అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) డీజీ, సీఐడీ డీజీగా (అదనపు బాధ్యతలు)
డాక్టర్ సౌమ్య మిశ్రా: మహిళా భద్రత, షీ టీమ్స్, డీజీ (ఆర్గనైజేషన్, లీగల్ విభాగాల అదనపు బాధ్యతలు)
స్వాతి లక్రా: జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్ డీజీ
అకున్ సబర్వాల్: అదనపు డీజీపీ (శాంతిభద్రతలు)
డీఐజీ ఇంటలిజన్స్: ఆర్. భాస్కరన్ (అదనపు బాధ్యతలు)
అనిల్ కుమార్: టీజీఎస్‌ఆర్టీసీ వైస్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్:
విక్రమ్ సింగ్ మాన్: గ్రేహౌండ్స్, ఆక్టోపస్ డీజీ
ఎం. స్టీఫెన్ రవీంద్ర: తెలంగాణ ట్రాఫిక్ మేనేజ్‌మెంట్, రోడ్ అండ్ రైల్ సేఫ్టీ బ్యూరో డైరెక్టర్
ఎస్.చంద్రశేఖర్ రెడ్డి: ఏసీబీ డైరెక్టర్,
కే.రమేష్ నాయుడు: రైల్వే ఐజీ
జోయెల్ డేవిస్: రోడ్ సేఫ్టీ, ట్రాఫిక్ విభాగాలు (అదనపు బాధ్యతలు)
కార్తికేయ: మల్టీ జోన్-1 ఐజీ
జోన్ 2 డీజీ: కే. నారాయణ నాయక్
జోన్ 6 డీజీ: ఎల్.ఎస్. చౌహాన్
జోన్ 7 డీజీ: జి. చందనా దీప్తి,
శ్రీ బాలాదేవి: టీజీ-టీఎంఏఆర్‌ఎస్ డిప్యూటీ డైరెక్టర్ (అడ్మినిస్ట్రేషన్) .