ఇడుపు కాయితం టీజర్‌..

November 12, 2026


img

వంశీ రెడ్డి దొండపాటి దర్శకత్వంలో ప్రియదర్శి, కొత్త హీరోయిన్‌ నాగదుర్గ జంటగా నటిస్తున్న ‘ఇడుపు కాయితం’ టీజర్‌ విడుదలైంది.

పెళ్ళి చూపులలోనే ఒకరినొకరు ఇష్టపడటం, నూతన వధువు భయంభయంగా అత్తగారింట్లో అడుగుపెట్టడం, బారాత్ డాన్స్, వారి మధ్య అన్యోన్యత వంటి భావోద్వేగాలను ఇప్పటికే పాటల ద్వారా చాలా అద్భుతంగా చూపారు. ఇప్పుడు చూడముచ్చటైన ఈ జంట టీజర్‌లోనే ఇడుపు కాయితం వరకు వచ్చేశారు. మరి తర్వాత ఏమైనా ట్విస్టులున్నాయో లేదో ట్రైలర్‌లో చూపిస్తారేమో?  

ఈ సినిమాలో మైమ్ మధు, అభయ్ బేతిగంటి, రచ్చ రవి, జోర్దార్ సుజాత, బిత్తిరి సత్తి, చంద్రవ్వ, శివజ్యోతి (తీన్మార్ సావిత్రి) తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు సంగీతం: సురేష్ బొబ్బిలి, సినిమాటోగ్రాఫి: ఎం.ఎస్. బాల్ రెడ్డి ఎడిటింగ్: శ్రీధర్ సోంపల్లి, ఆర్ట్ డైరెక్టర్‌: ఆశిష్ తేజ పులాల చేస్తున్నారు. తెలంగాణ గ్రామీణ కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు

సుకుమార్ రైటింగ్స్, బీవీ వర్క్స్ బ్యానర్లపై బన్నీ వాస్, వంశీ రెడ్డి దొండపాటి, సురేష్ బొబ్బిలి కలిసి ఈ సినిమా నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్‌ 11న థియేటర్లలో విడుదల కాబోతోంది.

       


Related Post

సినిమా స‌మీక్ష