సిద్ధుకి జోడీగా నయన్.. సంగీతం జీవిపీ

November 11, 2026


img

స్టార్ బాయ్ సిద్ధూ జొన్నలగడ్డ కొత్త సినిమాకు బుధవారం ఉదయం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమం జరిగింది. ఈ సినిమాలో సిద్ధుకి జోడీగా నయన్ సారిక నటించబోతోంది.   

సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ సంస్థలు కలిసి ప్రొడక్షన్ నం:2గా తెరకెక్కించబోతున్న ఈ సినిమాకు కథ, దర్శకత్వం: మోహన్. బి, సంగీతం: జి.వి.ప్రకాష్ కుమార్‌, సినిమాటోగ్రఫీ: చంద్రు సెల్వరాజ్, ఆర్ట్: సాహి సురేష్ చేస్తున్నారు. 

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ హీరో హీరోయిన్ల మీద క్లాప్ కొట్టి లాంచనంగా సినిమా షూటింగ్‌ ప్రారంభించారు.   డిసెంబర్‌ 11 నుండి రెగ్యులర్ షూటింగ్‌ ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఆ తర్వాత మూడు పెద్ద షెడ్యూల్స్‌లో షూటింగ్‌ పూర్తిచేసి వచ్చే వేసవి సెలవులలో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.


Related Post

సినిమా స‌మీక్ష