రియాలిటీ నుంచి ‘రుత్తూ’ ప్రమో సాంగ్

November 11, 2026


img

కిరణ్‌ అబ్బవరం సొంతంగా వ్రాసుకున్న కథతో స్వీయ దర్శకత్వంలో నటిస్తున్న సినిమా ‘రియాలిటీ.’ ఈ సినిమా నుంచి ఇటీవల విడుదలైన ‘భజగోవిందం’ పాట అద్భుతంగా ఉండటంతో వైరల్ అయ్యింది. ఇప్పుడు ‘రుత్తూ’ అంటూ సాగే మరో పాట ప్రమో విడుదల చేశారు. రేపు (గురువారం) పూర్తిపాట విడుదల కాబోతోంది. 

చిన్న చిన్న తేట తెలుగు పదాలతో చక్కటి సాహిత్యంతో పూర్ణాచారి వ్రాసిన ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. కపిల్ కపిలన్ చక్కగా ఆలపించారు.      

ఈ సినిమాలో మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడుగా కిరణ్ అబ్బవరం, అతనికి జోడీగా దేవికా భట్‌ నటిస్తున్నారు. ఈ సినిమాలో శరత్‌ కుమార్‌, సాయికుమార్‌, రమేష్‌ ఇందిర, అన్నపూర్ణమ్మ తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు.

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: కిరణ్‌ అబ్బవరం, సంగీతం: భీమ్స్‌ సిసిరోలియో, కెమెరా: విశ్వాస్‌ డేనియల్‌, ఆర్ట్‌: సుధీర్‌ మాచర్ల,  ఎడిటింగ్‌: సంతోష్‌ నాయుడు చేస్తున్నారు. 

జాయ్‌ ఫిల్మ్స్‌ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై సుధాకర్‌ చాగంటి నిర్మిస్తున్న ఈ సినిమా క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబర్‌ 25న థియేటర్లలో విడుదల కానుంది.


Related Post

సినిమా స‌మీక్ష