యువ నటులలో తనదైన ప్రత్యేకముద్ర వేసిన సిద్ధూ జొన్నలగడ్డ ఈసారి సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న సినిమాలో నటించబోతున్నారు. ప్రొడక్షన్ నం:2గా తెరకెక్కించబోతున్న ఈ సినిమా పూజా కార్యక్రమం బుధవారం ఉదయం 9.32 గంటలకు హైదరాబాద్‌లో జరుగబోతోంది.
కొత్త సినిమా ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ చాలా ఆకర్షిస్తుంది. దానిలో నలుపు బ్యాక్ గ్రౌండ్లో శివలింగం, దాని పక్కనే ఇత్తడి నీళ్ళ చెంబు, కత్తి ఉన్నాయి.
ఈ సినిమాకు బాబీ (కొత్త దర్శకుడు) సినీ పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. నేడు పూజా కార్యక్రమం నిర్వహించి డిసెంబర్ 11 నుండి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నట్లు సమాచారం. ఆ తర్వాత మూడు పెద్ద షెడ్యూల్స్‌లో షూటింగ్ పూర్తిచేసి వచ్చే వేసవి సెలవులలో విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది.