కల్కిలో కమల్ లొకేషన్ ఫోటో... హ్యాపీ బర్త్ డే!

November 08, 2026


img

ప్రముఖ నటుడు కమల్ హాసన్ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా ‘కల్కి ఏడీ 2898’ షూటింగ్‌ లొకేషన్‌లో మేకప్‌తో ఉన్న అయన ఫోటోను చిత్ర బృందం సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. ఈ సినిమా మొదటి భాగంలో అయన కాంప్లెక్స్ అనే లోకానికి ‘సుప్రీమ్ యాస్కిన్’గా నటించారు. మొదటి భాగంలో తన పాత్ర నిడివి తక్కువగా ఉన్నప్పటికీ రెండో భాగంలో పూర్తిగా ఉంటుందని కమల్ హాసన్ స్వయంగా ఇదివరకు చెప్పారు. 

నేడు ఆయన పుట్టినరోజు, దీపావళి పండుగ రెండూ కలిసి వచ్చినప్పుడు కల్కి నుంచి ఇంతకంటే గొప్ప పోస్టర్‌ విడుదల చేస్తారని అందరూ ఆశిస్తే, ఇలాంటి లొకేషన్ ఫోటోతో సరిపెట్టడం చివుక్కుమనిపిస్తుంది. అయితే ఈ సినిమా షూటింగ్‌ శరవేగంగా సాగుతోందని ఈ పోస్టర్‌ స్పష్టం చేస్తోంది.

కల్కిమొదటి భాగంలో కీలక పాత్ర చేసిన బాలీవుడ్‌ బ్యూటీ దీపికా పడుకొనే వ్యక్తిగత కారణాలతో ఈ ప్రాజెక్టు నుంచి తప్పించడంతో ఆమె స్థానంలో ప్రియాంకా చోప్రాను తీసుకున్నారు. 

కల్కి ఎడి2898లో కీలక పాత్రలు చేసిన అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, సల్మాన్ దుల్కర్, మృణాల్ ఠాకూర్ విజయ్‌ దేవరకొండ, దిశా పటాని, సస్వత చటర్జీ, పశుపతి, తదితరులందరూ ఈ సీక్వెల్‌లో కూడా నటిస్తున్నారు.  

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: నాగ్ అశ్విన్, డైలాగ్స్: సాయి మాధవ్ బుర్రా,  సంగీతం: సంతోష్ నారాయణన్, కెమెరా: జోర్‌డ్జీ స్టోజిల్‌జెకోవిక్, ఎడిటింగ్: కోటగిరి వేంకటేశ్వర రావు అందిస్తున్నారు.

కల్కి ఎడి2898 సూపర్ హిట్ అవడంతో ఈసారి రూ.1000 కోట్ల భారీ బడ్జెట్‌తో హాలీవుడ్ స్థాయిలో ఈ సీక్వెల్‌ను వైజయంతీ మూవీస్‌ నిర్మిస్తోంది. 


Related Post

సినిమా స‌మీక్ష