నా వెనుక దేవుడు తప్ప ఎవరూ లేరు: ధనుష్‌

November 07, 2026


img

కోలీవుడ్‌ స్టార్ హీరో ధనుష్ రాజకీయ ప్రవేశంపై కొంతకాలంగా జోరుగా ప్రచారం సాగుతోంది. అయన తన అభిమాన సంఘం పేరుని ‘ధనుష్ నర్పణి ఇయక్కం’గా మార్చడం, రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల కోసం ఉచిత ట్యూషన్ కేంద్రాలను ఏర్పాటు చేయాలనుకోవడమే ఈ ఊహాగానాలకు కారణంగా కనిపిస్తున్నాయి. 

ధనుష్‌ నటించిన ‘ఓం’ ఆడియో ఫంక్షన్‌లో విలేఖరులు అడిగిన ప్రశ్నకు జవాబిస్తూ, “అవును నా రాజకీయ ప్రవేశం గురించి రకరకాల వార్తలు వస్తున్నాయి. నేను ఫలానా పార్టీలో చేరుతానని, నా  వెనుక ఎవరో ఉన్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే నేను ఏ రాజకీయ పార్టీలో చేరడం లేదు. దేనికీ మద్దతు ఇవ్వడం లేదు,” అని ధనుష్‌ స్పష్టం చేశారు.

ఈ సంక్షేమ కార్యక్రమాలు రాజకీయాలలో చేరేందుకేనా? అనే ప్రశ్నకు జవాబిస్తూ, “ఇవి నా మనసుకు నచ్చిన పనులు. ఈ సమాజం వలన ఈ స్థాయికి ఎదిగిన నేను, తిరిగి సమాజానికి ఏదైనా మేలు చేయాలనుకున్నాను. అందుకే నన్ను ఈ దారిలో ఆ దేవుడే నడిపిస్తున్నాడు. దేవుడి ఆశీస్సులు, అభిమానులు మద్దతు ఉన్నందునే నేను ముందుకు సాగగలుగుతున్నాను,” అని ధనుష్‌ చెప్పారు. 

దీంతో తనకు బీజేపీ మద్దతు ఉందంటూ జరుగుతున్న ప్రచారానికి ఆయన సమాధానం ఇచ్చినట్లయింది.


Related Post

సినిమా స‌మీక్ష