టైసన్ నాయుడు.. మదరాసి రబ్బరు బొమ్మ లిరికల్ సాంగ్‌

November 07, 2026


img

సాగర్ కె. చంద్ర దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నేహా శెట్టి, ప్రగ్యా జైస్వాల్ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ‘టైసన్ నాయుడు’ సినిమా నుంచి ‘మదరాసి రబ్బరు బొమ్మ’ లిరికల్ వీడియో సాంగ్‌ విడుదల చేసింది. 

సురేష్ గంగుల వ్రాసిన ఈ పాటకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా, రోహిణి సొరట్ పాడారు. ఈ సినిమాలో నరేష్, రావు రమేష్, సత్య, వెన్నెల కిషోర్, ప్రవీణ్, ప్రవీణ, శత్రు తదితరులు ముఖ్య పాత్రలు చేస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో, సినిమాటోగ్రఫీ: అనిత్ మధాడి, కొరియోగ్రాఫీ: విజయ్ పోలాకి, ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు చేస్తున్నారు. 

14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపీ ఆచంట కలిసి నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది.


Related Post

సినిమా స‌మీక్ష