రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సిద్దిపేట ఆర్టీసీ డిపో మేనేజర్ తీరుపై తీవ్రంగా స్పందించారు. డిపోలో పనిచేస్తున్న కార్మికులు తమ సమస్యలను చెప్పుకునేందుకు అయన వద్దకు వెళ్ళినప్పుడు వారిని నేలపై కూర్చోబెట్టి తాను కుర్చీలో కూర్చొని వారితో మాట్లాడారు. ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఇది మంత్రి దృష్టికి రావడంతో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించారు.
ఆర్టీసీ కార్మికులపైనే ఆర్టీసీ సంస్థ మనుగడ ఆధారపడి ఉంది. కానీ వారికి సముచిత గౌరవం ఇవ్వకుండా నేలపై కూర్చోబెట్టి మాట్లాడటం చాలా తప్పు. కనుక దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మంత్రి పొన్నం ఆర్టీసీ ఎండీని ఆదేశించారు.
కార్మికులతో సిద్ధిపేట డిపో మేనేజర్ సమావేశం, ఆ ఫోటో రెండూ వాస్తవమే కనుక ఆయనపై క్రమశిక్షణ చర్యలు తప్పకపోవచ్చు.