కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో మంటలు... అందరూ సేఫ్

November 06, 2026
img

పంజాబ్‌లో కర్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. అమృత్‌సర్‌ నుంచి న్యూ జల్పాయిగురి వెళ్తునప్పుడు సరాయ్ బంజారా రైల్వే స్టేషన్ సమీపంలో ఈ ఘటన జరిగింది.

ముందు ఐదో బోగీలో మంటలు గుర్తించారు. ఆ తర్వాత పక్కనే ఉన్న ఇతర బోగీలకు కూడా మంటలు వేగంగా వ్యాపించాయి. దీంతో అప్రమత్తమైన ప్రయాణికులు వెంటనే గొలుసు లాగి రైలు నిలిపివేసి భయంతో కిందకు దిగి దూరంగా పరుగులు తీశారు.

సమాచారం అందుకున్న రైల్వే అధికారులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలు ఆర్పేసి సహాయక చర్యలు చేపట్టారు.

ఇప్పటివరకు అందిన సమాచారం ప్రకారం ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు సంభవించలేదు. మంటలు అదుపులోకి తీసుకొచ్చే చర్యలు చేపట్టడంతో పాటు ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చేందుకు వేరే రైలు ఏర్పాటు చేశారు.

ఏసీ బోగీలో షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కానీ ఈ ప్రమాదానికి అసలు కారణం ఇంకా నిర్ధారణ కాలేదు. రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Related Post