యువ నటుడు సాయి దుర్గా తేజ్, కిరణ్ వివాహ నిశ్చితార్ధ వేడుక హైదరాబాద్‌లోని హిల్టన్ జీనోమ్ వ్యాలీ రిసార్ట్‌లో గురువారం ఘనంగా జరిగింది.
ఈ వేడుకలో ఇరు కుటుంబ సభ్యులు, సాయి దుర్గా తేజ్ తల్లిదండ్రులు డాక్టర్ శివప్రసాద్, విజయదుర్గతో పాటు ఆయన సోదరుడు వైష్ణవ్ తేజ్ ఈ వేడుకలో పాల్గొన్నారు. మెగాస్టార్ చిరంజీవి, సురేఖ, రామ్ చరణ్, అల్లు అర్జున్, స్నేహారెడ్డి సహా కొణిదెల, అల్లు కుటుంబ సభ్యులు హాజరై సందడి చేశారు.
అల్లు అరవింద్, నిర్మల, నాగబాబు, పద్మజ, వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి, నిహారిక కొణిదెల, అల్లు శిరీష్, నాయనిక రెడ్డి, అకీరా నందన్, ఆద్య తదితరులు నూతన జంటను ఆశీర్వదించారు.
అలాగే సినీ పరిశ్రమ నుంచి మంచు మనోజ్ దంపతులు, నవీన్ విజయకృష్ణ, హర్ష చెముడు, దర్శకుడు వెంకీ కుడుముల, నవదీప్, నిర్మాత హర్షిత్ రెడ్డి తదితరులు హాజరయ్యి ఈ జంటకు శుభాకాంక్షలు తెలిపారు.
సాయి దుర్గా తేజ్, కిరణ్‌ల వివాహం డిసెంబర్ 10న హైదరాబాద్‌లో జరగనుంది.