ఈ కామెడీ టీమ్‌ కజకిస్తాన్‌లో ఏం చేస్తోందో?

November 07, 2026


img

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌, కళ్యాణ్ రామ్‌ హీరోలుగా చేస్తున్న ‘జనవరి 12 విడుదల’ మరో మంచి కామెడీ సినిమా అని అందరూ అనుకుంటున్నదే. కానీ ఈసారి కామెడీ మాత్రమే కాదు యాక్షన్ కూడా అంటూ ఓ వీడియో విడుదల చేశారు. దానిలో వారు ముగ్గురూ కజకిస్తాన్ ఎడారిలో ఉన్నట్లు చూపారు. కనుక అక్కడ ఈ సినిమా కోసం కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. 

ఈ సినిమాలో వెంకటేష్‌కి జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌కి జోడీగా క్రుతిశెట్టి నటిస్తున్నారు. 

సురేష్ ప్రొడక్షన్స్, షైన్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్లపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకి జీవి. ప్రకాష్ కుమార్‌ సంగీత దర్శకుడు. 


Related Post

సినిమా స‌మీక్ష