మెగాస్టార్ చిరంజీవి హీరోగా చేస్తున్న ‘కాకా’ సినిమా షూటింగ్ ఆగిపోయిందంటూ వస్తున్న వార్తలను కోన వెంకట్ ఖండించారు. ఈ సినిమా షూటింగ్ ఆగలేదు. రిలీజ్ వాయిదా పడలేదు. ఇలాంటి పుకార్లు ఎవరు పుట్టిస్తున్నారో కానీ వాటిని నమ్మవద్దని ప్రేక్షకులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ముందుగా ప్రకటించిన ప్రకారమే ‘కాకా’ సంక్రాంతి కానుకగా జనవరి 13న విడుదల కాబోతోంది,” అని చెప్పారు.
దర్శకుడు బాబీ కొల్లి దర్శకత్వంలో ‘కాకా’ సినిమా తెరకెక్కుతోంది. దాదాపు 70 శాతం చిత్రీకరణ పూర్తయిన తర్వాత చిరంజీవి సినిమా రషెస్ చూశారని, కథలో రజనీకాంత్ నటించిన బ్లాక్‌బస్టర్ ‘బాషా’ ఛాయలు కనిపించడంతో అసంతృప్తి వ్యక్తం చేశారని వార్తలు వచ్చాయి. దీంతో స్క్రిప్ట్‌లో మార్పులు చేసే వరకు షూటింగ్ నిలిపివేయాలని సూచించినట్లు ప్రచారం సాగింది.
కోన వెంకట్ సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. “మిమ్మల్ని నిరాశపరిచినందుకు క్షమించండి.. జనవరి 13న థియేటర్లలోకి వస్తున్నాము,” అంటూ పుకార్లు పుట్టించిన వారికి చురక వేశారు. చిరంజీవితో కలిసి దిగిన ఫొటోను కూడా పంచుకున్నారు.
ఈ సినిమాలో చిరంజీవి ఆక్వా పరిశ్రమలో పనిచేసే సూపర్వైజర్ సత్యంగా నటిస్తున్నారు. అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కే. చక్రవర్తి రెడ్డి, సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటింగ్: ఆంటోనీ రూబెన్ చేస్తున్నారు. డైలాగ్స్: భాను-నందు, యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్-లక్ష్మణ్, నబాకాంత్, ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా, వీఎఫ్ఎక్స్: యుగంధర్ చేస్తున్నారు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే. నారాయణ నిర్మిస్తున్న ‘కాకా’ 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి కాబోతోంది.
<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">Once again - Rest in Peace all the rumours, all fake news, all the baseless articles about “KAAKA” - Sorry to disappoint you but we are landing on Jan 13th 🚀 సంక్రాతికి “కాకా” వస్తున్నాడు 🔥 అసలైన పండగ తెస్తున్నాడు 🕺 @dirbobby @KvnProductions https://t.co/M1q3I9QH4g</p>— KONA VENKAT (@konavenkat99) <a href="https://x.com/konavenkat99/status/2118640015643468023?ref_src=twsrc%5Etfw">November 6, 2026</a></blockquote> <script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>