మహాకాళి నుంచి అయిగిరి నందిని ఇలా ఉందేమిటి?

November 06, 2026


img

‘మహాకాళి’ సినిమా నుంచి ఇటీవల విడుదల చేసిన ‘శుక్రాచార్య వార్ క్రై’ వీడియో అద్భుతంగా ఉంది. కానీ ఆ తర్వాత విడుదల చేసిన అమ్మవారి స్తోత్రం ‘అయిగిరి నందిని’ మాత్రం తీవ్రంగా నిరాశపరిచిందనే చెప్పాలి. 

గతంలో పలువురు ప్రముఖ గాయకులు ఆలపించిన ఈ అమ్మవారి స్తోత్రం విన్నప్పుడు తన్మయత్వం కలుగుతుంది. ఒళ్లు పులకరిస్తుంది. కానీ ప్రశాంత్ వర్మ వంటి మంచి దర్శకుడి పర్యవేక్షణలో వస్తున్న ‘మహాకాళి’ నుంచి విడుదల చేసిన ఈ పాట అటువంటి అనుభూతిని కలిగించలకపోగా ఇంత చక్కటి స్తోత్రాన్ని ఇలా మార్చేశారేమిటనిపిస్తుంది.

ఈ సినిమాలో రాక్షస గురువు శుక్రాచార్యుడిగా అక్షయ్ ఖన్నా నటిస్తుండగా, శ్రియా రెడ్డి, భూమి శెట్టి, రోహిత్ శరఫ్, ఖుష్బూ సుందర్, రాకేష్ బేడీ, సముద్రఖని, రజత్ కపూర్, జితిన్ గులాటి, మురళీ శర్మ, నాజర్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి ప్రశాంత్ వర్మ క్రియేటర్‌గా వ్యవహరిస్తుండగా, పూజా అపర్ణ కొల్లూరు దర్శకత్వం వహిస్తున్నారు.

మహాకాళికి కథ, స్క్రీన్‌ప్లే: ప్రశాంత్ వర్మ, స్నేహ సమీరా; సంగీతం: స్మరణ్ సాయి; సినిమాటోగ్రఫీ: సురేష్ రగుతు; ఎడిటింగ్: హర్ష వర్ధన్ దన్నాసి చేస్తున్నారు. 

ఆర్కే దుగ్గల్ సమర్పణలో ఆర్కేడీ స్టూడియోస్ బ్యానర్‌పై రివాజ్ రమేష్ దుగ్గల్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.


Related Post

సినిమా స‌మీక్ష