ఇప్పుడు ట్రైలర్‌.. 13న సినిమా చూడండి: ఇట్లు అర్జున

November 05, 2026


img

యంగ్ హీరో అనీష్, అనస్వర రాజన్ జంటగా నటించిన ‘ఇట్లు అర్జున’ ట్రైలర్‌ విడుదలైంది. ఇది పక్కా కమర్షియల్ సినిమా అని ట్రైలర్‌తో స్పష్టమైంది.

కానీ ఈ సినిమాతో హీరోగా పరిచయమవుతున్న అనీష్, తొలి సినిమాలోనే మూగవాడు నటిస్తుండటం ఆశ్చర్యం కలిగిస్తుంది. మరి ఈ హీరో ప్రేమలో పడితే?హీరోయిన్‌తో  రొమాంటిక్ సాంగ్స్.. పంచ్ డైలాగ్స్ పలకకపోతే? సినిమా ఎలా ఉంటుందో అనిపిస్తుంది. కానీ ట్రైలర్‌ చూస్తే ఇలాగే హీరోయిన్‌తో పాటు ప్రేక్షకులను కూడా మెప్పించగలడనిపిస్తుంది.      

ఈ సినిమాలో వెన్నెల కిశోర్‌, ముకేశ్‌ రిషి, కలైయరసన్‌ హరికృష్ణన్‌, ఎలాంగో కుమరవేల్‌, గెటప్‌ శ్రీను, రఘుబాబు, అరుణ భిక్షు, ప్రవీణ లలితాబాయి, రోహన్‌ రాయ్‌ తదితరులు ముఖ్య పాత్రల్లో నటించారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: మహేష్ ఉప్పల, సంగీతం: తమన్, కెమెరా: రాజా మహదేవన్, స్టంట్స్:దినేష్ సుబ్బరాయన్, ఎడిటింగ్: కోటి చేశారు. 

వాట్ నెక్స్ట్ ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై ప్రొడక్షన్: నం:1గా తెరకెక్కించిన ఈ సినిమాని ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుమల నిర్మించారు. ఈ నెల13న ‘ఇట్లు అర్జున’ సినిమా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష