ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువులో 10 మంది సిబ్బంది గల్లంతయ్యారు. వరద నీటిలో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడేందుకు బుధవారం సాయంత్రం ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రెండు బోట్లలో అక్కడకు చేరుకున్నారు. వరద ఉదృతి ఎక్కువగా ఉండటంతో రెండు బోట్లు తిరగబడ్డాయి. దీంతో వాటిలో ఉన్న 10 మంది సిబ్బంది ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. నీటిలో గల్లంతయ్యారు.తిరగబడటంతో ఈ ఘటన జరిగింది.
సమాచారం అందుకున్న జిల్లా ఉన్నతాధికారులు, గజ ఈతగాళ్లతో కూడిన సహాయ బృందాలతో అక్కడకు చేరుకొని బేతుపల్లి చెరువులో గాలింపు చర్యలు చేపట్టారు. ఈ సమాచారం అందుకున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెంటనే స్పందిస్తూ భద్రాచలం నుంచి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపించారు. వారు కూడా ఈ గాలింపు చర్యల్లో పాల్గొంటున్నారు.
సిఎం రేవంత్ రెడ్డి ఆదేశం మేరకు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అక్కడకు చేరుకొని గాలింపు చర్యలను పర్యవేక్షించారు. గల్లంతైన సిబ్బంది ఆచూకీ ఇంతవరకు లభించలేదు.