ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది అందరూ సేఫ్!

November 05, 2026
img

ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలంలోని బేతుపల్లి చెరువులో గల్లంతయిన 10 మంది ఎస్‌డీఆర్ఎఫ్ క్షేమంగా ఉన్నారు. వారి కోసం గాలిస్తున్న మరో ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు ముందుగా ఐదుగురిని కనిపెట్టి ఒడ్డుకు తీసుకు వచ్చారు. ఆ తర్వాత మరో ముగ్గురు ఆచూకి కనిపెట్టి వారినీ కాపాడారు. ఆ తర్వాత మిగిలిన వారితో పాటు వరదలోచిక్కుకున్న ఓ మత్స్యకారుడిని కూడా కాపాడి ఒడ్డుకు తెచ్చారు. 

బెతుపల్లి చెరువులో వరదలో చిక్కుకున్న మత్స్యకారులను కాపాడేందుకు బుధవారం సాయంత్రం ఎస్‌డీఆర్ఎఫ్ సిబ్బంది రెండు బోట్లలో వెళ్ళినప్పుడు వారి రెండు బోట్లు  తిరగబడ్డాయి. వాటిలో ఉన్న 10 మంది సిబ్బంది ఆ ప్రవాహంలో కొట్టుకుపోయారు. కానీ వారు ఈదుకుంటూ సురక్షిత ప్రాంతం చేరుకొని ప్రాణాలు కాపాడుకున్నారు. ఎస్‌డీఆర్ఎఫ్, ఎన్‌డీఆర్ఎఫ్ బృందాలు వారిని కాపాడి ఒడ్డుకు తీసుకు రావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Related Post