నవంబర్ 7 వృషకర్మ నుంచి స్వాగ్ ఆఫ్ అర్జున్

November 05, 2026


img

అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘వృషకర్మ’ సినిమా నుంచి ‘స్వాగ్ ఆఫ్ అర్జున్’ పేరుతో మొదటి పాట నవంబర్ 7న విడుదల కాబోతోంది. నాగచైతన్య స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ఆ తర్వాత వరుసగా పాటలు విడుదలవుతాయి. 

ఈ సినిమాలో నాగచైతన్య ‘అర్జున్’గా కనిపించబోతున్నట్లు తాజా పోస్టర్‌తో చెప్పేశారు. ఈ పాటకు అజనీష్ బి. లోక్‌నాథ్ అద్భుతమైన సంగీతం అందించారని, ఇది తన కెరీర్‌లో ప్రత్యేకంగా నిలుస్తుందని నాగచైతన్య పేర్కొన్నారు.

‘విరూపాక్ష’ సినిమాతో గుర్తింపు తెచ్చుకున్న కార్తీక్ దండు ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. 

ఈ సినిమాలో నాగచైతన్యకు జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుండగా, సూపర్ హిట్ హిందీ సినిమా ‘లాపతా లేడీస్’తో మంచి గుర్తింపు తెచ్చుకున్న స్పర్శ్ శ్రీవాస్తవ ఈ సినిమా విలన్‌గా నటిస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్‌ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్‌నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమా నిర్మాణంలో సుకుమార్ రైటింగ్స్ కూడా భాగస్వామిగా ఉండటంతో భారీ అంచనాలున్నాయి. ఈ డిసెంబర్‌ 4వ తేదీన వృషకర్మ ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష