మరకతమణి-2 షూటింగ్‌ సమాప్తం..త్వరలో ట్రైలర్‌

November 08, 2026


img

ఆది పినిశెట్టి హీరోగా చేస్తున్న ఫాంటసీ, అడ్వెంచర్‌ చిత్రం ‘మరకతమణి- 2’ నుంచి నేడు దీపావళి పండుగ సందర్భంగా పోస్టర్‌ విడుదల చేశారు. కొన్ని వారాల క్రితమే సినిమా షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ సినిమా 2027 మొదట్లో విడుదల చేయబోతున్నట్లు పోస్టర్‌లో తెలియజేశారు. త్వరలోనే టీజర్‌, ట్రైలర్‌, పాటలు వరుసగా విడుదల కాబోతున్నాయి. 

ఏఆర్‌కే శరవణన్‌ దర్శకత్వంలో 2017లో విడుదలైన ‘మరకతమణి’ చిత్రానికి ఇది సీక్వెల్‌. ఈ సినిమాలో నిక్కీ గల్రాణి, ప్రియా భవానీ శంకర్‌, సత్యరాజ్‌, మునీష్‌కాంత్‌, ఆనంద్‌రాజ్‌, డేనియల్‌ అన్నీ పోప్‌, అరుణ్‌రాజా కామరాజ్‌ తదితరులు నటిస్తున్నారు.

ఈ సినిమాకు సంగీతం: ధీబు నినన్‌ థామస్‌, సినిమాటోగ్రఫీ: దీపక్‌ డి. మీనన్‌, పి.వి. శంకర్‌, ఎడిటింగ్‌: తిరుమలై రాజన్‌ చేస్తున్నారు. ప్యాషన్‌ స్టూడియోస్‌, ఆక్సెస్‌ ఫిల్మ్‌ ఫ్యాక్టరీ బ్యానర్లపై నిర్మిస్తున్నారు.


Related Post

సినిమా స‌మీక్ష