హనుమరెడ్డి యక్కంటి దర్శకత్వంలో మంచు మనోజ్ హీరోగా చేస్తున్నపీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా ‘డేవిడ్ రెడ్డి.’ నేడు దీపావళి పండుగ సందర్భంగా ఈ సినిమా నుంచి మంచు మనోజ్ పోస్టర్ విడుదల చేశారు. బ్రిటిష్ పతాకం మంటలలో తగులబడుతుంటే రెండు చేతులకు మంటలతో రౌద్రరూపంలో మంచు మనోజ్‌ను చూపారు.
ఈ సినిమాలో ఉక్రెయిన్ అందాల భామ మరియా ర్యాబోషప్కా హీరోయిన్‌గా నటిస్తోంది. ఆమె ‘క్లారా విట్మోర్’గా నటిస్తుండగా కమలారెడ్డిగా రమ్యకృష్ణ నటిస్తున్నారు. ఇదివరకే వీరిద్దరి ఫస్ట్ లుక్ పోస్టర్ల ద్వారా ప్రేక్షకులకు పరిచయం చేశారు.
ఈ సినిమాకు సంగీతం: రవి బస్రూర్, కోరియోగ్రఫీ: సుప్రీం సుందర్, యాక్షన్: సుప్రీం సుందర్, వింగ్ చున్ అంజి, ఎడిటింగ్: ఉజ్వల్ కులకర్ణి చేస్తున్నారు.
వెల్వెట్ సోల్ మోషన్ పిక్చర్స్, ట్రూ రాడిక్స్ బ్యానర్లపై మోతుకూరి భరత్, నల్లగంగుల వెంకట్ రెడ్డి కలిసి 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు.