ఇరుముడి హీరోయిన్‌కు మూడు ముళ్ళు

November 11, 2026


img

ఇరుముడి సినిమాలో రవితేజ భార్యగా తెలుగు ప్రేక్షకులను మెప్పించిన తమిళ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టారు. 

తన చిరకాల మిత్రుడు, ప్రియుడు రాజ్‌వేల్ రాజ్‌ను ఆమె వివాహం చేసుకున్నారు. నవంబర్ 11న కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో వీరి వివాహ వేడుక సంప్రదాయబద్ధంగా జరిగింది.

ప్రియా, రాజ్‌వేల్ ఇద్దరూ కాలేజీ రోజుల నుంచే పరిచయం ఉంది. అలా మొదలైన వీరి పరిచయం ప్రేమగా మారింది. దాదాపు పదేళ్లకు పైగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. 

టాలీవుడ్‌, కోలీవుడ్‌ సినీ ప్రముఖులు, అభిమానులు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ప్రియా భవానీ శంకర్ మొదట న్యూస్ రీడర్‌గా తన కెరీర్ ప్రారంభించారు. ఆ రంగంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న తర్వాత సినిమాల్లో అవకాశం లభించడంతో తమిళ సినిమా 'మేయాద మాన్' తో హీరోయిన్‌గా పరిచయమైయ్యారు. ఆ తర్వాత ఆమె చేసిన నాలుగైదు సినిమాలతో మంచి నటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రేక్షకులకు మరింత చేరువయ్యారు. ఇటీవల రవితేజ సరసన 'ఇరుముడి' సినిమాలో నటించి తెలుగు ప్రేక్షకులకూ పరిచయమయ్యారు. ప్రస్తుతం పలు తమిళ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఆమె భర్త రాజ్‌వేల్ రాజ్‌ డేటా అండ్ లాయాల్టీ అనలిస్టుగా పనిచేస్తున్నారు. 



Related Post

సినిమా స‌మీక్ష