టార్టాయిస్ నుంచి రంగు రంగు రంగు పిల్లరో లిరికల్ సాంగ్

November 12, 2026


img

రాజ్ తరుణ్, అమృత చౌదరి జంటగా నటిస్తున్నా తాజా చిత్రం టార్టాయిస్. ఈ సినిమా నుంచి ‘రంగు రంగు రంగు పిల్లరో’ అంటూ సాగే లిరికల్ వీడియో సాంగ్‌ విడుదలైంది. 

ప్రముఖ జానపద గాయకుడు, రచయిత పెంచల్ దాస్ ఈ పాటకు సాహిత్యం అందించడంతో పాటు స్వయంగా ఆలపించారు.ఈ పాటకు అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. 

రిత్విక్ కుమార్ దర్శకత్వంలో సస్పెన్స్, డ్రామా, యాక్షన్ అంశాలతో ‘టార్టాయిస్’ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో అవసరాల శ్రీనివాస్, ధన్య బాలకృష్ణ, షిజు ఏఆర్, రవి కాలె, మొయిన్, సురేష్, సుజన, వర్షిత, డాక్టర్ రామకృష్ణ కొటకొండ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ సినిమాకు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: రిత్విక్ కుమార్‌, పాటలు: చంద్రబోస్, పెంచల్ దాస్, వంశీ కమల్, సంగీతం: అనూప్ రూబెన్స్, సినిమాటోగ్రఫీ: శబరి విక్నేష్, కొరియోగ్రఫీ: రిత్విక్ కుమార్, ఫైట్స్: బీమనొళ్ల శ్రీకాంత్, వెంకటేష్ కాపు, రాజ్ కృష్ణ, ఆర్ట్: దేవర మధుకర్, ఎడిటింగ్: గుళ్లపల్లి మాధవ్ కుమార్‌ చేస్తున్నారు. 

ఎస్‌కే గోల్డెన్ ఆర్ట్స్, ప్రశ్విత ఎంటర్‌టైన్‌మెంట్, ఎన్‌వీఎల్ క్రియేషన్స్ బ్యానర్లపై విజయ్ చౌదరి, శశిధర్ నల్ల, రామిశెట్టి రాంబాబు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మానస కుమార్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. 


Related Post

సినిమా స‌మీక్ష