మీనాక్షి అవుట్ సందీప్ ఇన్‌..ఛార్జ్‌: తెలంగాణ కాంగ్రెస్‌

November 14, 2026


img

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జ్‌ మీనాక్షి నటరాజన్ స్థానంలో బి.ఎం.సందీప్‌ను కాంగ్రెస్‌ అధిష్టానం ఇన్‌ఛార్జ్‌గా  నియమించింది. ఈ నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత వ్యవహారాలు) కేసీ వేణుగోపాల్ అధికారిక ప్రకటన విడుదల చేశారు.

తెలంగాణ కాంగ్రెస్‌లో నాయకుల మద్య అంతర్గత విభేదాలు, సమన్వయ సమస్యలు పరిష్కరించి పార్టీని గాడిన పెట్టడంలో ఆమె విఫలమైనందున ఈ మార్పు చోటు చేసుకుని ఉండవచ్చు. ఆమె స్థానంలో వస్తున్న బి.ఎం.సందీప్‌ అయినా తెలంగాణ కాంగ్రెస్‌ నేతలను గాడిన పెట్టగలరో లేదో చూడాలి. ఆమెను ఈ పదవి నుంచి తొలగించినప్పటికీ ఇంతకాలం తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ వ్యవహారాలను సమర్ధంగా పర్యవేక్షించినందుకు కాంగ్రెస్ అధిష్ఠానం ఆమె సేవలను ప్రశంసించింది.

బి.ఎం.సందీప్‌ గతంలో మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేశారు. పంచాయతీరాజ్ & యువజన కాంగ్రెస్: రాజీవ్ గాంధీ పంచాయతీరాజ్ సంఘటన్  జాతీయ కన్వీనర్‌గా, కర్ణాటక రాష్ట్ర ఛైర్మన్‌గా, ఇండియన్ యూత్ కాంగ్రెస్ రిటర్నింగ్ ఆఫీసర్‌గా కీలక బాధ్యతలు నిర్వహించారు.

క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడం, గిరిజన సంక్షేమ కార్యక్రమాలను ప్రజలలోకి తీసుకువెళ్ళడంలో ఆయనకు ప్రత్యేక గుర్తింపు ఉంది.


Related Post