గిగ్ వర్కర్స్‌పై వరాల జల్లు కురిపించిన సీఎం రేవంత్‌ రెడ్డి

November 14, 2026


img

అవును! తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ అగ్రనేత, ఎంపీ రాహుల్‌ గాంధీ శనివారం ఉదయం హైదరాబాద్‌లో గిగ్ వర్కర్స్‌తో కలిసి బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. శిల్పకళావేదిక వద్ద నుంచి మాదాపూర్ వద్ద జయభేరీ మైదానం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీలో పలువురు కాంగ్రెస్‌ నేతలు కూడా పాల్గొన్నారు. 

అనంతరం జయభేరీ మైదానంలో జరిగిన గిగ్ వర్కర్స్‌ సభలో సీఎం రేవంత్‌ రెడ్డి గిగ్ వర్కర్స్‌పై వరాల జల్లులు కురిపించారు. ఆ వివరాలు: 

గిగ్ వర్కర్స్‌ సంక్షేమం, సామాజిక భద్రత కోసం ప్రత్యేక చట్టం అమలు. రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది గిగ్ వర్కర్లకు ఈ చట్టం ద్వారా ప్రయోజనం కలగనుంది.

గిగ్ వర్కర్ల రిజిస్ట్రేషన్ కోసం ఆన్‌లైన్, మొబైల్ యాప్‌తో పాటు సర్వీస్ సెంటర్లలోనూ సదుపాయం కల్పించనుంది. 

రిజిస్ట్రేషన్ పూర్తయిన 15 పని దినాల్లో ప్రత్యేక గుర్తింపు కార్డు, గుర్తింపు సంఖ్య జారీ చేయనుంది. ఈ గుర్తింపు కార్డు జీవితకాలం చెల్లుబాటు అవుతుంది.

గిగ్ వర్కర్స్‌ ద్వారా జరిగే ప్రతీ డెలివరీ ద్వారా జరిగే ఆర్ధిక లావాదేవీపై గరిష్ఠంగా 2 శాతం వరకు వెల్ఫేర్ ఫండ్ ఫీజు విధించనుంది. దీనిని సదరు సంస్థలే చెల్లించాల్సి ఉంటుంది. కార్మికుల ఆదాయం నుంచి దీనిని వసూలు చేయకూడదు. గిగ్ వర్కర్స్‌కు ఏడు రోజుల్లోగా తప్పనిసరిగా చెల్లింపులు చేయాలి. వారిని పని నుంచి తొలగించే ముందు ఏడు రోజుల నోటీసు ఇవ్వాలి. పని నిరాకరించినందుకు రేటింగ్ తగ్గించడం, ఇతర శిక్షలు విధించడం ఇకపై కుదరదు. 

కార్మికుల భద్రత కోసం ప్రభుత్వం పానిక్ బటన్, ప్రత్యేక హెల్ప్‌లైన్ ఏర్పాటు చేయనుంది. ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కమిటీలు నియమించనుంది. వంద మంది లేదా అంతకంటే ఎక్కువ మంది గిగ్ వర్కర్లు ఉన్న సంస్థల్లో తప్పనిసరిగా ఇలాంటి ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలి. ఇందులో మహిళా ప్రతినిధులకు కనీసం రెండు స్థానాలు కల్పించాలి.

వెల్ఫేర్ ఫండ్ ద్వారా ప్రమాద, వైద్య, ప్రసూతి, జీవిత బీమా ప్రయోజనాలు కల్పించే అవకాశం ఉంది. నిబంధనలు ఉల్లంఘించే సంస్థలకు మొదటిసారి రూ.50,000, రెండోసారి రూ.లక్ష, మూడోసారి రూ.1.50 లక్షలు జరిమానా విధించనుంది. నాలుగోసారి నుంచి చెల్లించాల్సిన ఫీజుకు ఐదు రెట్లు జరిమానా విధించనుంది.

<blockquote class="twitter-tweet"><p lang="en" dir="ltr">LIVE : Hon’ble CM Sri A.Revanth Reddy participating in Launch of GIG workers Welfare Scheme https://t.co/tHDnVoApap</p>&mdash; Telangana Congress (@INCTelangana) <a href="https://x.com/INCTelangana/status/2121480423377129593?ref_src=twsrc%5Etfw">November 14, 2026</a></blockquote> <script async src="https://platform.x.com/widgets.js" charset="utf-8"></script>

Related Post