హలో ప్రేమ.. వానల్లే.. వీడియో సాంగ్ రిలీజ్

November 14, 2026


img

ఆర్య, నిఖిలా విమల్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘హలో ప్రేమ.’ ఈ సినిమా నుంచి ‘వానల్లే..’ అంటూ సాగే ఓ రొమాంటిక్ వీడియో సాంగ్‌ విడుదలైంది. 

శ్రీమణి వ్రాసిన ఈ పాటను జీవీ ప్రకాశ్ కుమార్ స్వరపరిచి సంగీతం అందించగా అజయ్ ఎస్ కశ్యప్, రమ్య భట్ మృదుమధురంగా ఆలపించారు. 

నిఖిల్ మురళి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కథ: సును ఏవీ, జ్యోతిష్ ఎం, సంగీతం: జి.వి.ప్రకాశ్ కుమార్‌, సినిమాటోగ్రఫీ: జీవా శంకర్, కొరియోగ్రఫీ: షెరిఫ్ ఎం, అజర్ ఆర్ట్: ఏఆర్ మోహన్, ఫైట్స్: స్టంట్ సిల్వా, ఎడిటింగ్: బిను నెపోలియన్ చేశారు. 

ది షో పీపుల్, సిల్వర్ గ్రెయిన్ పిక్చర్స్ బ్యానర్లపై నిర్మిస్తున్న ఈ సినిమా రిలీజ్‌ డేట్ ఇంకా ప్రకటించాల్సి ఉంది. 


Related Post

సినిమా స‌మీక్ష