గోపీచంద్ మలినేని దర్శకత్వంలో గాడ్ ఆఫ్ మాసస్ నందమూరి బాలకృష్ణ హీరోగా చేస్తున్న ‘దాదా’ నుంచి దాదా దమాఖా.. ఐటెం సాంగ్ విడుదలైంది. రామజోగయ్య శాస్త్రి వ్రాసిన ఈ పాటకు తమన్ సంగీతం అందించగా నందమూరి బాలకృష్ణ, శ్రీ పూర్ణిమ కలిసి పాడారు. ఈ పాటలో బాలయ్య కు నర్గీస్ ఫఖిరీతో కలిసి హుషారుగా డాన్స్ చేశారు.
ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తుండగా, మంచు మనోజ్, సముద్రఖని, ఆర్.శరత్ కుమార్, అభిమన్యు సింగ్, ఉపేంద్ర లిమాయే, మనీష్ వాధ్వా, స్వాసిక ముఖ్య పాత్రలు చేస్తున్నారు.
ఈ సినిమాకు మాటలు: సాయి మాధవ్ బుర్రా, పాటలు: రామజోగయ్య శాస్త్రి, సంగీతం తమన్, సినిమాటోగ్రఫీ: అరవింద్ ఎస్ కశ్యప్, ఎడిటింగ్: నవీన్ నూలి, యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్-లక్ష్మణ్, వి.వెంకట్, రవివర్మ, కొరియోగ్రఫీ: శేఖర్ వీజే ఫర్ చేస్తున్నారు.
వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ బాలయ్య మార్క్ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 24న విడుదల కాబోతోంది.