మెగాస్టార్ చిరంజీవిలి వరుసకు సోదరుడైన కొణిదెల సూర్యప్రకాష్ రావు కుమారుడు కొణిదెల పవన్ తేజ్ హీరోగా చేస్తున్న సినిమా పేరు ‘జంట’ అని ఖరారు చేశారు. ఈ సినిమాలో పవన్ తేజ్ ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో విడుదల చేశారు. ‘యుద్ధం రాముడితో కాదు రాజ్యంతో...’ అంటూ పెట్టిన క్యాప్షన్ ఆలోచింపజేస్తుంది.
ఇప్పటికే మూడు సినిమాలు చేసిన పవన్ తేజ్‌కు కనీసం ఈ సినిమా హిట్ అయితే మంచి గుర్తింపు వస్తుంది. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: రాజశేఖర్ యాదవ్, సంగీతం: సుభాష ఈశాన్, ఆర్ట్: పెద్దిరాజు అద్దాల, డైలాగ్స్: ఎన్. మధు, ఫైట్స్: గౌరీ శంకర్ చేస్తున్నారు.
వసుంధర ఆర్ట్స్ బ్యానర్‌పై రాజేష్ గునిశెట్టి, వీరు యాదవ్ కలిసి ఈ సినిమా నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో హీరోయిన్, ఇతర నటీనటుల వివరాలు చిత్రబృందం ఇంకా ప్రకటించాల్సి ఉంది.