అనుపమ పరమేశ్వరన్, తరుణ్ భాస్కర్ భాస్కర్ ప్రధానపాత్రలు చేసిన ‘క్రేజీ కల్యాణం’ అక్టోబర్ 16న థియేటర్లలో విడుదలైంది. గాజుల బద్రప్ప గజుల కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాకు మిశ్రమ స్పందన వచ్చింది. ఇప్పుడీ సినిమా ఈ నెల 20 నుంచి ఆహా ఓటీటీలోకి రాబోతోంది.
క్లుప్తంగా ఈ సినిమా కథ ఏమిటంటే, పర్వతాలు(నరేష్) పెద్దల్లుడు బాలరాజు (తరుణ్ భాస్కర్) తాగుబోతు. అతని వలన ఊళ్ళో తలెత్తుకోలేకపోతున్న పర్వతాలు కనీసం రెండో కూతురు కీర్తి (అనుపమ పరమేశ్వరన్)కు మంచి సంబంధం చూసి పెళ్ళి చేయాలనుకుంటాడు.
కానీ కీర్తి ఆలోచనలు వేరు. ఎలాగైనా ప్రభుత్వోద్యోగం సంపాదించి జీవితంలో స్థిరపడిన తర్వాత తాను ప్రేమించిన ఉదయ్ (అఖిల్)ను పెళ్ళి చేసుకోవాలనుకుంటుంది. తండ్రి అమెరికా సంబంధం తెస్తే ఉదయ్‌తో తన ప్రేమ వ్యవహారం బయటపెడుతుంది. ఆ తర్వాత ఏం జరిగిందనేది క్రేజీ కల్యాణం ఓటీటీలో వచ్చినప్పుడు చూసి తెలుసుకోవాల్సిందే.