దాదా తర్వాత కాకా.. స్పెషల్ సాంగ్‌

November 15, 2026


img

నందమూరి బాలకృష్ణ హీరోగా చేస్తున్న ‘దాదా’ సినిమా నుంచి స్పెషల్ సాంగ్‌ శనివారమే విడుదలైంది. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘కాకా’ సినిమా నుంచి స్పెషల్ సాంగ్‌ త్వరలో రాబోతోంది. 

బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’లో రితికా సింగ్‌తో కలిసి చిరంజీవి డాన్స్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ పాట షూటింగ్ కూడా పూర్తయింది. ఈ పాటకు ఎస్.ఎస్.తమన్ సంగీతం, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు.

చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో ఇదివరకు వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ అయినందున, మళ్ళీ వారిద్దరి కాంబినేషన్‌లో వస్తున్న ‘కాకా’పై కూడా భారీ అంచనాలు ఉన్నాయి. 

ఈ సినిమాలో అనస్వర రాజన్, నివేదా పేతురాజ్, సునీల్, గెటప్ శ్రీను కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

ఈ సినిమాకు స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కే. చక్రవర్తి రెడ్డి, సంగీతం: తమన్, సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్, ఎడిటింగ్: ఆంటోనీ రూబెన్ చేస్తున్నారు. డైలాగ్స్: భాను-నందు, యాక్షన్ కొరియోగ్రఫీ: రామ్-లక్ష్మణ్, నబాకాంత్,  ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా, వీఎఫ్‌ఎక్స్‌: యుగంధర్ చేస్తున్నారు. 

కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే. నారాయణ నిర్మిస్తున్న ‘కాక’ 2027 సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష