టాలీవుడ్ హీరో శర్వానంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘జార్జ్ క్రిష్’ పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని ముందే చెప్పేశారు. ఈ సినిమాలో శర్వానంద్ జూనియర్ సైంటిస్ట్‌గా ప్రేక్షకులపై కామెడీ ప్రయోగం చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. వచ్చే వారంతో చివరి షెడ్యూల్ పూర్తవబోతోంది. జనవరిలో సంక్రాంతి పండగకు రిలీజ్ అని ముందే అనుకున్నారు కనుక పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇటీవలే డబ్బింగ్ కూడా ప్రారంభించారు.
ఈ సినిమాలో శర్వానంద్ జార్జ్, క్రిష్ అనే రెండు పాత్రలు చేస్తున్నట్లు టైటిల్‌తోనే చెప్పారు. ఫస్ట్ గ్లింప్స్‌లో కూడా శర్వానంద్ హిందూ, క్రీస్టియన్ వేషధారణలో కనిపించాడు. ఇప్పుడు కొత్తగా జూనియర్ సైంటిస్ట్ అంటున్నారు. పైగా శ్రీను వైట్ల సినిమాలో కామెడీకి కరువు ఉండదు. ఈ సినిమాలో శర్వానంద్‌కు జోడీగా మానస వారణాసి నటిస్తున్నారు.
ఈ సినిమాకు కథ: నందు సవిరిగన, సంగీతం: అనుప్ రూబెన్స్, కెమెరా: కేవీ గుహన్, ఆర్ట్: కొల్ల అవినాష్, ఎడిటింగ్: అమర్ రెడ్డి, :గోపీ మోహన్ చేస్తున్నారు.
ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర, అజయ్ సుంకర, రామబ్రహ్మం సుంకర, కిషోర్ గరికపాటి కలిసి నిర్మిస్తున్న ‘జార్జ్ క్రిష్’ 2027, జనవరి 14న సంక్రాంతి పండుగ రోజున విడుదల కాబోతోంది.