ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా వచ్చిన ‘హనుమాన్’ సినిమాకు సీక్వెల్‌గా ‘జై హనుమాన్’ ప్రకటించిన సంగతి తెలిసిందే
కానీ హనుమాన్ తర్వాత దర్శక నిర్మాతల మధ్య మనస్పర్ధలు రావడంతో, ప్రశాంత్ వర్మ ఈసారి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై రిషబ్ శెట్టి ప్రధాన పాత్రలో 'జై హనుమాన్' తీస్తున్నారు.
అయితే ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ కూడా ‘హనుమాన్’కు సీక్వెల్‌గా ‘హనుమాన్-2: ది రైజ్ ఆఫ్ వానరాస్’ అంటూ శనివారం తమ సినిమా పోస్టర్ సోషల్ మీడియాలో విడుదల చేసింది.
విఐ ఆనంద్ దర్శకత్వంలో నిర్మిస్తున్న ఈ సినిమాలో మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్ ప్రధాన పాత్ర చేస్తున్నారు.
ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి కలిసి ఈ సినిమాను 5 భాషల్లో పాన్ ఇండియా మూవీగా నిర్మిస్తున్నారు. త్వరలో ఈ సినిమాలో ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణులు, షూటింగ్, విడుదల తేదీ వివరాలను చిత్రబృందం వెల్లడించనుంది.