అలియాస్ రుక్మిణి.. ఇక నువ్వు నేను లిరికల్

November 21, 2026


img

నితిన్, ఆఫియా సయ్యద్ జంటగా నటిస్తున్న ‘అలియాస్ రుక్మిణి’ సినిమా నుంచి ముచ్చటగా మూడో పాట ‘ఇక నువ్వు నేను..’ ‘యూట్యూబ్‌ మ్యూజిక్’లో విడుదలైంది.  

మురళీకాంత్‌ దేవసోత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో సాయి కుమార్‌, హర్ష్ రోషన్‌ వర్ధన్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. 

ఈ సినిమాలో రచయిత కృష్ణగా నటిస్తున్న నితిన్‌, టీచర్‌గా నటిస్తున్న రుక్మిణి (ఆఫియా సయ్యద్ )తో ప్రేమలో పడతాడు. ఆమె పేరుతో ప్రేమ నవలలు రాస్తుంటాడు. 

ఈ సినిమాకు సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, కెమెరా: జోమోన్‌ టీ.జాన్‌, ఎడిటింగ్‌: సృజన అడుసుమిల్లి చేస్తున్నారు. 

నటుడు నాని సమర్పణలో దీప్తి గంటా యునానిమస్‌ ప్రొడక్షన్స్‌ పతాకంపై నిర్మిస్తున్న అలియాస్ రుక్మిణి డిసెంబర్ 4న విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష