శ్రీలీలకు మరో బంపర్ ఆఫర్ దక్కింది. సూపర్ స్టార్ రజనీకాంత్ సినిమాలో నటించే అవకాశం ఆమెను వరించింది. రజనీకాంత్ హీరోగా నటిస్తున్న ‘ధర్మన్’ సినిమాలో శ్రీలీల కూడా భాగమయ్యారని ఈ సినిమా నిర్మాణ సంస్థ రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ అధికారికంగా ప్రకటించింది.
కోలీవుడ్ దర్శకుడు అశ్వత్ మారిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రజనీకాంత్, శ్రీలీల, నయనతార, సిమ్రన్, రాశీ ఖన్నా, యోగిబాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇందులో రజనీకాంత్ డాక్టర్‌గా నటిస్తున్నారు. ఆయన పాత్రలో నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయని తెలుస్తోంది.
ఈ సినిమాకు సంగీతం: అనిరుధ్ రవిచందర్, సినిమాటోగ్రఫీ: నికేత్ బొమ్మి, స్టంట్: అన్బరివ్, ఎడిటింగ్: ప్రదీప్ ఈ రాఘవ్, చేస్తున్నారు.
రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్, టర్మరిక్ మీడియా బ్యానర్లపై కమల్ హాసన్, ఆర్.మహేంద్రన్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నెలలో ఈ సినిమాను విడుదల చేయాలని ప్లాన్ చేసుకున్నారు.