ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని తొలిసారిగా స్వీయ దర్శకత్వంలో తన 23వ సినిమా ‘రాపో 23’ తెరకెక్కించబోతున్నారు. నేడు అంతర్జాతీయ పురుషుల దినోత్సవం సందర్భంగా త్వరలోనే ఈ సినిమా టైటిల్ టీజర్ విడుదల చేస్తామని తెలియజేస్తూ ఓ పోస్టర్ వేశారు.
లెదర్ జాకెట్ ధరించి మెట్ల వద్ద నిలబడిన రామ్ పోతినేని ఒక చేతిలో తుపాకీ, మరో చేతిలో టెడ్డీ బేర్ పట్టుకుని చూపారు. ఇది ‘ఒంటరి తోడేలు కథ అని మరోసారి చెప్పారు. అంటే చిన్న పిల్లలను అక్రమ రవాణా చేసే ముఠాలతో హీరో ఒంటరి పోరాటాలు ఈ సినిమా కథ అయ్యుండవచ్చు.
ఈ సినిమాలో రామ్ పోతినేని పాత్ర పేరు ‘వీర.’ ఆయనకు జోడీగా శ్రీనిధి శెట్టి పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.
రాపో సినిమాటిక్స్ బ్యానర్‌పై క్రిష్ణ పోతినేని నిర్మిస్తున్న ఈ సైకాలజికల్ యాక్షన్ థ్రిల్లర్ సినిమా షూటింగ్ ఇప్పటికే దాదాపు పూర్తి అయినట్లు సమాచారం.