అనిల్ రావిపూడి హ్యూమర్‌కు హ్యాట్సాఫ్

November 19, 2026


img

అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేష్‌, కళ్యాణ్ రామ్‌ హీరోలుగా చేస్తున్న ‘జనవరి 12 విడుదల’ (సబ్ టైటిల్‌ ‘బావ బామర్ది సౌజన్యంతో’) సినిమా విడుదలకు ఇంకా చాలా సమయమే ఉంది. కానీ అప్పుడే సినిమా ప్రమోషన్స్‌ మొదలుపెట్టేశారు. అదీ తన స్టైల్లో! ఒక్కో సినిమాకు ఒక్కో మెట్టు ఎక్కుతూ ఫ్యామిలీ-కామెడీ జోనర్‌లో తనను మించినవారు లేరనిపించుకుంటున్నారు అనిల్ రావిపూడి. 

సోషల్ మీడియాలో తాజాగా పోస్ట్ చేసిన రజనీకాంత్, శోభనల సూపర్ హిట్ మూవీ ‘దళపతి’ వీడియో స్కిట్‌ చూసినప్పుడు ఏదో గంభీరమైన విషయం చెప్పబోతున్నారనుకుంటాము. కానీ దానిలో అనిల్ రావిపూడి నటన,  ముగింపు చూస్తే నవ్వాపుకోలేము. దాని గురించి ఇంకా వివరించడం కంటే అది మీరే స్వయంగా చూసి ఆనందిస్తే బాగుంటుంది.          

ఈ సినిమాలో వెంకటేష్‌కి జోడీగా కీర్తి సురేష్, కళ్యాణ్ రామ్‌కి జోడీగా క్రుతిశెట్టి నటిస్తున్నారు. అనిల్ రావిపూడి ఈ నలుగురితో ఈసారి ఎలాంటి కామెడీ పండించబోతున్నారో తెలియాలంటే ‘జనవరి 12న ‘జనవరి 12విడుదలయినప్పుడు తెలుస్తుంది. 

సురేష్ ప్రొడక్షన్స్, షైన్ స్క్రీన్, జీ స్టూడియోస్ బ్యానర్లపై సాహు గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాకి జీవి. ప్రకాష్ కుమార్‌ సంగీత దర్శకుడు. 


Related Post

సినిమా స‌మీక్ష