తరుణ్ భాస్కర్‌కు ఈషా రెబ్బా సోల్‌మేట్.. పక్కా!

November 18, 2026
img

దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్, హీరోయిన్ ఈషా రెబ్బా రిలేషన్‌షిప్‌పై గత కొంతకాలంగా వస్తున్న వార్తలకు తరుణ్ తల్లి గీతా భాస్కర్ తెర దించారు. 

తరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన 'ఈఎన్ఈ రిపీట్' ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పాల్గొన్న గీతా భాస్కర్ తన కొడుకు గత రెండేళ్లుగా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడని తెలిపారు. కోర్టు కేసులు, ఇల్లు కట్టుకోవడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడ్డాడని, కొన్నిసార్లు అర్ధరాత్రి 2, 4 గంటలకు ఇంటికి వచ్చేవాడని గుర్తుచేసుకున్నారు.

అలాంటి సమయంలో తన కొడుకు తరుణ్‌కు ఈషా రెబ్బా అండగా నిలిచిందని గీతా భాస్కర్ చెప్పారు. ఈషా కేవలం స్నేహితురాలు మాత్రమే కాదని, తరుణ్‌కు మంచి సపోర్ట్, ఫ్యామిలీ, సోల్‌మేట్ అని అన్నారు. తన కొడుకుకు మంచి తోడు దొరికినందుకు తనకు చాలా సంతోషంగా ఉందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. తన కొడుకుకు అండగా నిలుస్తున్నందుకు ఈషా రెబ్బాకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు.

గీతా భాస్కర్ వ్యాఖ్యలతో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బాలు పెళ్ళి పీటలు ఎక్కడం ఖాయమని స్పష్టమైనట్లే! 

Related Post