సోనియాజీ! ప్లీజ్ నోట్‌ దిస్ పాయింట్: కేటీఆర్‌

November 17, 2026


img

సోనియాగాంధీ ఆత్మకథ ‘ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకంపై ఊహించినట్లే రాజకీయ ప్రత్యర్ధులు విమర్శలు గుప్పిస్తున్నారు. వారిలో బీఆర్ఎస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌ కూడా ఒకరు, ఆయన కాంగ్రెస్‌ నేతలను, ఆమెను సూటిగా ఓ ప్రశ్న అడిగారు. తెలంగాణ రాష్ట్రం, ప్రజలు అంటే సోనియాగాంధీకి చాలా ప్రేమ అని చెప్పుకుంటున్నప్పుడు, ఆమె ఆత్మకథలో ఎక్కడా ‘తెలంగాణ’ ప్రస్తావనే లేదేమి? కనీసం తెలంగాణ అనే పదం కూడా ఎందుకు కనపడలేదు? అని సూటిగా ప్రశ్నించారు. 

ఆమె తెలంగాణ ప్రజలపై ప్రేమతో రాష్ట్రాన్ని ఏర్పాటు చేశారని కాంగ్రెస్‌ నేతలు చెప్పుకోవడం సిగ్గుచేటు. తెలంగాణ ప్రజలు అలుపెరుగని పోరాటాలు చేయడం వలన, అనేకమంది బలిదానాల వల్ల నాటి యూపీఏ ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ ఏర్పాటు చేయక తప్పలేదు. కానీ తెలంగాణ క్రెడిట్‌ని ఆమెకు ఆపాదిస్తూ రాష్ట్ర ప్రజలు ఆమెకు కృతజ్ఞతగా ఉండాలని కాంగ్రెస్‌ నేతలు చెప్పడం సిగ్గుచేటు. అయినా ఆమెకు తెలంగాణ పట్ల ఎటువంటి ప్రేమ లేదని ఈ పుస్తకంతో నిరూపించుకున్నారు కదా?,” అని అన్నారు. 

కనుక కాంగ్రెస్‌ నేతలు, సోనియాగాంధీజీ.. ప్లీజ్ నోట్‌ దిస్ పాయింట్ ఆఫ్ కేటీఆర్‌!           



Related Post