వృషకర్మ సెకండ్ సింగిల్‌కిముహూర్తం ఖరారు

November 17, 2026


img

కార్తీక్ దండు దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య, మీనాక్షి చౌదరి జంటగా చేస్తున్న మైథలాజికల్ మిస్టరీ థ్రిల్లర్‌పై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 4న విడుదలకు సిద్దం అవుతోంది. కనుక చిత్రబృందం ప్రమోషన్స్ వేగం పెంచి రెండో పాట విడుదల తేదీని ప్రకటించింది.

‘ఛలో పదవే..’ అంటూ సాగే రెండో పాటను ఈ నెల 19న విడుదల చేస్తున్నన్నట్లు తెలియజేస్తూ పోస్టర్‌ విడుదల చేశారు. అమాయకత్వంతో కూడిన ఓ చిన్న ప్రపంచం, ఎన్నో మధురమైన భావోద్వేగాలు.. అంటూ ఈ పాట గురించి రెండు ముక్కలో తెలిపారు. 

బాలీవుడ్ నటుడు స్పర్ష్ శ్రీవాత్సవ్ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నారు. 

ఈ సినిమాకు కధ, దర్శకత్వం: కార్తీక్‌ దండు, స్క్రీన్ ప్లే: సుకుమార్, సంగీతం: అజనీష్ బి లోక్‌నాధ్, కెమెరా: నైల్ డి కునహా, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు. 

బాపినీడు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర సినీ చిత్ర, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై బివిఎస్ఎన్ ప్రసాద్‌ ఈ సినిమా నిర్మిస్తున్నారు. వచ్చే నెల అంటే డిసెంబర్‌ 4వ తేదీన వృషకర్మ విడుదల కాబోతోంది. 


Related Post

సినిమా స‌మీక్ష