ఆకాశంలో ఒక తార ట్రైలర్‌.. చూశారా?

November 17, 2026


img

మళయాళ నటుడు సల్మాన్ దుల్కర్‌, తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి ప్రధాన పాత్రలు చేసిన ‘ఆకాశంలో ఒక తార’ ట్రైలర్‌ విడుదలైంది. పవన్ సాదినేని దర్శకత్వంలో  రూపొందించిన ఈ సినిమాలో శ్రుతీ హాసన్, మురళీశర్మ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.  

ఈ సినిమాకు కథ, దర్శకత్వం: పరవన్ సాదినేని, స్క్రీన్ ప్లే: గంగరాజు గుణ్ణం, సంగీతం: జీవీ ప్రకాష్ కుమార్‌, కెమెరా: సుజీత్ సారంగ్, ఆర్ట్: వంశీ కృష్ణ; ఎడిటింగ్: ప్రవీణ్ కేఎల్ చేశారు. 

ప్రముఖ సినీ నిర్మాణ సంస్థలు గీతా ఆర్ట్స్, స్వప్నా సినిమా,  లైట్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్లపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం కలిసి ఈ సినిమాను నాలుగు భాషల్లో నిర్మించారు. ఆకాశంలో ఒక తార నవంబర్‌ 20న విడుదల కాబోతోంది.


Related Post

సినిమా స‌మీక్ష